మాస్ ఆడియన్సుని టార్గెట్ చేసిన కృష్ణ వంశీ !


గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా బరిలోకి దిగితున్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో మాస్ ఆడియన్సుకి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నారు. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమారు 6 పాటలు, 14 నుండి 16 వరకు హెవీ యాక్షన్ ఎపిసోడ్లు ఉండేలా ప్లాన్ చేశారట. ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ ప్రధాన తారాగణమైన సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ వంటి వారిపై రూపొందిచారట.

సినిమా షూటింగ్ సమయంలో కూడా ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టింది. కృష్ణ వంశీ అండ్ టీమ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్లలతో, అత్యుత్తమ సాంకేతికతను వినియోగించి వీటిని తెరకెక్కించారు. కనుక ఇవి మాస్ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తాయని, సినిమా కృష్ణ వంశీకి గత వైభవాన్ని తీసుకొస్తుందని టాక్. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, హీరో తనీష్ లు కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు.