“కృష్ణ వ్రింద విహారి” ఆడియో హక్కులను సొంతం చేసుకున్న “సరిగమ”..!

“కృష్ణ వ్రింద విహారి” ఆడియో హక్కులను సొంతం చేసుకున్న “సరిగమ”..!

Published on Mar 5, 2022 7:30 PM IST

యంగ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా ఆడియో హక్కులను “సరిగమసౌత్” సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో నాగశౌర్య ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్‌ నటి రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు