లేటెస్ట్ : ‘కృష్ణ వ్రింద విహారి’ మూడు రోజుల కలెక్షన్ ఎంతంటే … ?

Published on Sep 26, 2022 4:00 pm IST

యువ నటుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి. షిర్లే సెటియా హీరోయిన్ గా కనిపించిన ఈ మూవీని ఉష మూల్పూరి నిర్మించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి సరిగ్గా మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

రొమాంటిక్ యాక్షన్ కం ఫామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు అనీష్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా యువత తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే విషయం ఏమిటంటే, మొత్తంగా మూడురోజుల్లో కృష్ణ వ్రింద విహారి మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 8. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. రాధికా శరత్ కుమార్, బ్రహ్మాజీ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ మూవీలో ఇతర పాత్రలు చేసారు.

సంబంధిత సమాచారం :