బాలీవుడ్ కి వెళ్తున్న మరో తెలుగు సినిమా

Krishnamma-Kalipindi-Iddari

ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు ఇక్కడ పెద్ద హిట్ కాకపోయినా ఇక్కడ నుంచి బాలీవుడ్ లో రీమేక్ అయ్యి అక్కడ కాసుల వర్షం కురిపిస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. పోకిరి, విక్రమార్కుడు, కిక్, రెడీ, కందిరీగ లాంటి సినిమాలు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మిగిలాయి. తాజాగా బాలీవుడ్ లో మరో తెలుగు సినిమాని రీమేక్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. ఆ సినిమానే ‘కృష్ణమ్మ కలిపిందిఇద్దరినీ’.

ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు, ఇంకా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమా రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ నిర్మాతలు కొనుక్కున్నారు. సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ని హీరోగా పరిశీలిస్తున్నారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలో సుధీర్ బాబు – నందిత జంటగా నటిస్తున్నారు. చందు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version