టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కృష్ణమ్మ. ఈ చిత్రం మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి వచ్చింది. వి వి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో అర్చన, కృష్ణ బురుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన వసూళ్ల వివరాలను మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఈ చిత్రం మొదటి రోజు కంటే రెండో రోజు కాస్త ఎక్కువ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం రెండు రోజుల్లో 2.24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.