“రాధే శ్యామ్” లో పరమహంస పాత్ర లో రెబల్ స్టార్ కృష్ణంరాజు…లుక్ రిలీజ్

Published on Dec 20, 2021 5:52 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూ వీ క్రియేషన్స్ పతాకంపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్ కి సంగీతం అందిస్తున్నారు. మిథున్, అమాల్ మల్లిక్ లు హిందీ వెర్షన్ కి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రం లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. పరమహంస పాత్ర లో కృష్ణంరాజు నటిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో కృష్ణంరాజు కాషాయ వస్త్రాలు ధరించి ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :