లేటెస్ట్ : ‘రంగమార్తాండ’ కాస్ట్ & క్రూ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్… !!

Published on Jul 7, 2022 7:26 pm IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. కృష్ణవంశీ కెరీర్ 21వ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కెరీర్ పరంగా ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ నుండి వస్తున్న ఈ మూవీ రంగస్థల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా అప్ డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన యూనిట్, నేడు ఈ మూవీ యొక్క కాస్ట్ అండ్ క్రూ కి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేసింది.

మన అమ్మా నాన్నల కథగా సాగనున్న ఈ మూవీకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇళయరాజా మ్యూజిక్ అందిస్తుండగా, దివంగత లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాసారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, పద్మశ్రీ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి శయారి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కవితలతో కూడిన వాయిస్ ఓవర్ తో సాగే శయారి ద్వారా మెగాస్టార్ తో ప్రయోగం చేయిస్తున్నారట కృష్ణవంశీ. మొత్తంగా రంగమార్తాండ నుండి నేడు రిలీజ్ అయిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుండగా మూవీకి సంబంధించి ఒక్కొక్కటిగా విశేషాలు రాబోయే మరికొద్ది రోజుల్లో ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :