ప్రారంభోత్సవానికి సిద్దమైన క్రిష్ హిందీ ప్రాజెక్ట్ !
Published on May 4, 2017 4:29 pm IST


‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో దర్శకుడిగా తన స్థాయిని రెట్టింపు చేసుకున్న క్రిష్ ఇప్పుడు మరో బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. ఈసారి ఆయన తెరకెక్కించబోయేది భారతదేశ ప్రజలందరికీ బాగా సుపరచితమైన ‘రాణి లక్ష్మీ భాయ్’ యొక్క జీవితగాథను. ఈ సినిమాకు ‘మణికర్ణిక’ అనే టైటిల్ ను కూడా సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని ఈరోజు సాయంత్రం ఘాన్సీలో అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

ఆ వేడుకలో 20 అడుగుల పోస్టర్ ను కూడా రివీల్ చేయనున్నారు. ఇందులో రాణి లక్ష్మి భాయ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇకపోతే ‘బాహుబలి’ తో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న రచయితా విజయేంద్ర ప్రసాద్ రూపొందించిన ఈ స్క్రిప్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి నిర్మించనుంది.

 
Like us on Facebook