క్రిష్ నెక్స్ట్ సినిమా కూడా సీనియర్ స్టార్ హీరోతోనే !
Published on Jan 16, 2017 3:53 pm IST

krish-int
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ తాజాగా బాలకృష్ణతో కలిసి ‘గౌతమిపుత్రశాతకర్ణి’ చిత్రాన్ని చేసి మరింత ఘనత పొందాడు. దాదాపు అందరి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. సినీ అభిమానులకు కూడా క్రిష్ పై ఉన్న గురి, అభిమానం మరింత ఎక్కువయ్యాయి. దీంతో అందరూ ఆయన తరువాతి సినిమా ఏంటి, ఎవరితో చేస్తారు అని ఆలోచించడం మొదలుపట్టారు. ఆ ప్రశ్నలకు సమాధానం అన్నట్టుగా క్రిష్ తన తరువాతి ప్రాజెక్ట్ గురించిన విశేషాలు తెలిపారు.

క్రిష్ తన తరువాతి చిత్రాన్ని సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేయనున్నానని, ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించనున్నారని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం పూర్తయ్యాక క్రిష్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో సినిమా చేస్తానని కూడా అన్నారు. ఇకపోతే వెంకటేష్ తాజాగా నటించిన ‘గురు’ చిత్రం జనవరి 26 న రిలీజుకు సిద్ధమవుతోంది.

 
Like us on Facebook