మహేష్ బాబు, రామ్ చరణ్ ల పై కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Jul 5, 2022 2:45 pm IST

రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు మరియు తమిళంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ది వారియర్ ఒకటి.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా కృతి శెట్టి పలు ఇంటర్వ్యూ లతో బిజిగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కృతి శెట్టి రామ్ చరణ్ సూపర్ క్యూట్ మరియు మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. కృతి కూడా సమీప భవిష్యత్తులో ఈ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. లింగుసామి దర్శకత్వం వహించిన వారియర్‌లో ఆది పినిశెట్టి నెగిటివ్ పాత్రలో నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :