కోలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న బేబమ్మ?

Published on Mar 16, 2022 12:06 am IST


టాలీవుడ్ యంగ్ హీరోయిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్‌కి ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పలు ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందన్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అది కూడా స్టార్ హీరో సూర్య సినిమాలో నటించబోతుందట.

అయితే తాజాగా ‘ఈటీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ బాలాతో చేయబోతున్నాడు. అయితే కృతిశెట్టి యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన బాలా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైన‌ల్ చేయాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఈ ఆఫర్ వస్తే కనుక కృతి ఒకే చేసి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో లేక మరికొన్ని రోజులు టాలీవుడ్‌లోనే ఫోకస్ చేస్తుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :