నితిన్ “మాచర్ల నియోజకవర్గం” నుండి కృతి శెట్టి స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Published on Jul 17, 2022 8:14 pm IST

నితిన్ హీరోగా రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈచిత్రం నుండి చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు మేకర్స్. ట్రెండీ పసుపు దుస్తులలో స్టైలిష్‌గా కనిపిస్తుంది కృతి శెట్టి. ఆమె ఇక్కడ కాఫీని ఆస్వాదించడాన్ని చూడవచ్చు.

ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో కథానాయికగా నటిస్తుంది. నటి అంజలి ప్రత్యేక నంబర్ రారా రెడ్డిలో కనిపించనుంది మరియు లిరికల్ వీడియోకు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నారు. సముద్రఖని ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్ కాగా, మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మాచర్ల నియోజకవర్గం చిత్రం ను ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :