‘కృతి శెట్టి’ ఖాతాలో కొత్త ఆఫర్లు.. అక్కడ కూడా క్రేజ్ పెరిగింది !

Published on Jul 3, 2022 10:11 pm IST

టీనేజ్ బ్యూటీ కృతి శెట్టి తెలుగు తెరకు పరిచేయమవుతూనే వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తుంది. మొదటి సినిమా ఉప్పెనలోనే కృతి శెట్టి తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టిపడేసింది. ఇండస్ట్రిలోకి అడుగుపెడుతూనే బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పైగా ఈ అమ్మడికి తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ భారీ ఆఫర్స్ వస్తుండటం విశేషం. తాజాగా కృతి శెట్టి స్టార్ హీరోల సరసన కూడా నటించబోతుంది.

యాక్షన్ హీరో విశాల్ హీరోగా రానున్న కొత్త తమిళ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే, విశాల్ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని కన్ఫర్మ్ చేశారట. మొత్తానికి తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి కృతి శెట్టి టైమ్ బాగుంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయేలా ఉంది. ఆల్ రెడీ కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :