అప్పుడే గుణపాఠం నేర్చుకోవాలి అంటున్న స్టార్ హీరోయిన్ !

Published on Aug 7, 2022 11:09 pm IST

బాలీవుడ్ భామ కృతి సనన్, మహేశ్ ‘వన్: నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌ లో ‘దిల్‌వాలే’, ‘లుకా చప్పీ’ ‘మిమి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అయితే, తాజాగా ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కృతి సనన్ తన జర్నీకి సంబంధించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటనేది కృతి సనన్ మాటల్లోనే..‘నాలో కూడా అనేక భావోద్వేగాలు ఉంటాయి. కొన్ని సినిమాలను నేను నమ్మి చేస్తాను. అవి ప్లాప్ అయినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. అయినా నాలో నేను ఎంతో బాధను దిగమింగుకుని మరో సినిమాలోకి వెళ్లాలి. విజయం సాధించినా, పరాజయం పాలయినా దానిని తప్పకుండా ఒప్పుకోవాలి. ఆ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. తర్వాతిది విజయం సాధిస్తుందని నమ్మాలి’ అంటూ కృతి సనన్ చెపుకొచ్చింది.

సంబంధిత సమాచారం :