“ఆదిపురుష్” పై కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“ఆదిపురుష్” పై కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 18, 2022 8:59 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అసలుకి వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా టీజర్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి అయితే మేకర్స్ మళ్ళీ బెటర్ వర్క్ నిమిత్తం సినిమాని వాయిదా వేయడం జరిగింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో హీరోయిన్ కృతి సనన్ లేటెస్ట్ గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా విషయంలో తాను మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ అంతా కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని అయితే కేవలం టీజర్ తో సినిమా మొత్తాన్ని అంచనా వేయడానికి లేదని ఈ సినిమా ని చాలా గ్రాండ్ విజువల్స్ తో చాలా పవర్ ఫుల్ గా డైరెక్టర్ ఓంరౌత్ ప్లాన్ చేసాడని. ఇప్పుడుకి కూడా ఇంకా బెటర్ గా చూపించడం కోసమే వర్క్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు