“ఆదిపురుష్” లో తన షూట్ కంప్లీట్ చేసేసిన కృతి!

Published on Oct 16, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇక ఆల్ మోస్ట్ కంప్లీట్ కి వచ్చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్”. హిందీ మరియు తెలుగులో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో కీలక నటులు ఒక్కొక్కరూ తమ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. గత వారమే సినిమాలో రావణాసురుని పాత్ర చేసిన బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకోగా..

ఇప్పుడు ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో నటించిన స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా ఇప్పుడు తన షూట్ అంతటినీ కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో చిత్ర యూనిట్ ఈ సందర్భంగా సైఫ్ లానే కృతికి కూడా తమ ఫెర్వెల్ పార్టీ నిర్వహించి వీడ్కోలు చెప్పారు. మరి 3డి లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

More