“బంగార్రాజు” లో నాగలక్ష్మి గా కృతి శెట్టి…ఫస్ట్ లుక్ విడుదల!

“బంగార్రాజు” లో నాగలక్ష్మి గా కృతి శెట్టి…ఫస్ట్ లుక్ విడుదల!

Published on Nov 18, 2021 11:40 AM IST


అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం లో అక్కినేని నాగ చైతన్య మరియు ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి లు కూడా నటిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి కృతి శెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

ఈ చిత్రం లో కృతి శెట్టి నాగ లక్ష్మీ పాత్ర లో నటిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు