కృతిశెట్టి లోని డ్యాన్సర్‌ ను పరిచయం చేసే పాట అట !

Published on Jan 10, 2022 10:00 am IST

కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చైతు – నాగ్ కలయికలో రాబోతున్న ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకాబోతోంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా చిత్రయూనిట్ ఆదివారం ‘బంగార్రాజు’ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలోని ‘బంగారా’ పాట నాకు బాగా నచ్చింది. నిజంగా ఆ పాట నన్నెంతగానో ఆకట్టుకుంది. ఎందుకంటే.. ఆ పాట మీకు నాలోని డ్యాన్సర్‌ ను పరిచయం చేసే ఫస్ట్ సాంగ్.

ఇక మధుప్రియ గారు కూడా ఈ పాటను చాలా బాగా పాడింది. అలాగే భాస్కరభట్లగారు కూడా మంచి సాహిత్యం అందించారు. ఇక అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అద్భుతం’. నాకు అవకాశం ఇచ్చినందుకు నాగ్ సర్, కల్యాణ్‌ కృష్ణ సర్ కి థాంక్స్’ అని చెప్పుకొచ్చింది కృతిశెట్టి. ఇక ఈ కార్యక్రమంలో నటులు సుశాంత్‌, సుమంత్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష, గేయ రచయితలు కాసర్ల శ్యామ్‌, భాస్కరభట్ల రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :