బాలక్రిష్ణ రజనీకాంత్ లాంటివారు.. కమల్ హాసన్ కాదు !
Published on Jan 13, 2018 3:10 pm IST

నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ నిన్ననే థియేటర్లలోకి వచ్చింది. సినిమాను చూసిన కొంతమంది కథ చాలా పాతగా ఉందని, అందులో ఎలాంటి కొత్తదనం లేదని, కొంచెమైనా ఫ్రెష్ స్టోరీ ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ ‘జై సింహ’ కు అలాంటి కథే ఎందుకు ఎంచుకుంది దర్శకుడ్ కె.ఎస్.రవికుమార్ క్లారిటీ ఇచ్చారు.

అదేమిటంటే బాలక్రిష్ణకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటిది నేను కేవలం క్లాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే బాగుండదు. అందుకే మాస్ ఆడియన్స్ కోసం అలాంటి కథే ఎంచుకున్నాను. తమిళంలో రజనీకాంత్ ఎలాగో ఇక్కడ బాలక్రిష్ణ అలాగ. ఆయనకు కమల్ హాసన్ లా క్లాస్ కథలు రాస్తే సరిపోదు. మాస్ కథలే సరిగ్గాసరిపోతాయి. అందుకే ఆ కథను ఎంచుకున్నాం. అనుకున్నట్టే ఆ కథలోని ఎమోషన్, సెంటిమెంట్ మాస్ ఆడియన్సుకి కనెక్టయ్యాయి అన్నారు.

 
Like us on Facebook