మానస్ ‘క్షీరసాగర మథనం’ మరో నాలుగు భాషల్లోకి..!

Published on Dec 14, 2021 10:00 pm IST

బిగ్‌బాస్ సీజన్‌ 5లో టాప్ ఫైవ్‌ కంటెస్టెంట్ జాబితాలో మానస్ నాగులపల్లి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే మానస్ నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ మొదటివారంలో థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకుంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాలో మానస్‌తో పాటు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్, గౌతమ్ శెట్టి, అక్షత సోనావని ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్‌ 5 టాప్ ఫైవ్‌ జాబితాలో మానస్‌కు చోటు దక్కడంపై ఈ చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. మానస్‌ బిగ్ బాస్ 5 విజేతగా నిలవాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అంతేకాదు ‘క్షీరసాగర మథనం’ సినిమాకు థియేటర్, ఓటీటీలో మంచి ఆదరణ లభించిందని, త్వరలోనే ఈ సినిమాను హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేయాలని అనుకుంటున్నామని దర్శకుడు అనిల్‌ పంగులూరి తెలిపారు.

సంబంధిత సమాచారం :