‘క్షణం’ సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు రవికాంత్ రెండో సినిమాను ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ లో రానా నిర్మిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్ర షూటింగ్ఇటీవలే పూర్తయ్యింది. వేసవిలో సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో యూనిట్ మెంబెర్స్ ఉన్నారు.
శీరత్ కపూర్, శ్రద్ద శ్రీనాథ్, షాలినీ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గుంటూర్ టాకీస్’ సినిమా తరువాత సిద్దు చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ఈ మూవీ తన కెరీర్ కు హెల్ప్ అవుతుందని సిద్దు భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సిద్దు నూతన దర్శకుడితో సినిమా చెయ్యబోతున్నాడు. ఆ చిత్ర వివరాలు త్వరలో తెలియనున్నాయి.
