‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి కేటీఆర్..!

Published on Oct 14, 2021 2:20 am IST


మల్లేశం, కాంచివరం తరహాలోనే చేనేత కళాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన మరో చిత్రం ‘తమసోమా జ్యోతిర్గమయ’. ఈ సినిమా ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్ రిఈల్ చేశాడు. గుణ ఎంటర్ టైమెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై తడక రమేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతొ చేనేత వృత్తిలో ఎన్నో ఆవిష్కరణలు రావాలని, ఇందుకు ‘తమసోమా జ్యోతిర్గమయ’లాంటి చిత్రాలు దోహదపడతాయని అన్నారు.

ఇక దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘తమసోమ జ్యోతిర్గమయ’ సినిమాలో 2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితి ఎలా ఉందో ఈ చిత్రంలో చూపించబోతున్నామని ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :