సమ్మతమే ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్న కేటీఆర్‌

Published on Jun 16, 2022 10:45 am IST

కిరణ్ అబ్బవరం తన తాజా చిత్రం సమ్మతమే తో తన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపీనాథ్ రెడ్డికి ఇది తొలి సినిమా. ఈ సినిమాలో కిరణ్‌కు జోడీగా చాందినీ చౌదరి నటించింది. ఈరోజు సాయంత్రం 04:05 గంటలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌మోష‌న్ కంటెంట్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24, 2022 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమ్మతమే చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :