నేపాల్లో కుర్చీ మడతపెట్టి హవా.. మరోపక్క మరో రికార్డ్ కూడా

నేపాల్లో కుర్చీ మడతపెట్టి హవా.. మరోపక్క మరో రికార్డ్ కూడా

Published on Jan 23, 2025 10:30 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ విషయంలో మహేష్ అభిమానులు ఏ రేంజ్ లో నెగిటివ్ చేశారో అందరికీ తెలుసు. కానీ సీన్ కట్ చేస్తే తను ఇచ్చిన ఆల్బమ్ ఇపుడు నెవర్ బిఫోర్ రీచ్ తో గ్లోబల్ సెన్సేషన్ గా మారింది.

ఇక లేటెస్ట్ గా అయితే నేపాల్ లో కుర్చీ మడత పెట్టి సాంగ్ అదరగొడుతుంది. అక్కడ వందలాది మంది విద్యార్థులు అలాగే రోడ్లపై కూడా కొందరు మహిళలు ఈ సాంగ్ వేసి స్టెప్పేస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక ఇదే కాకుండా ఈ సాంగ్ యూట్యూబ్ లో మరో రికార్డ్ సెట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. మన తెలుగు నుంచి 550 మిలియన్ వ్యూస్ అందుకున్న ఫాస్టెస్ట్ వీడియో సాంగ్ గా నిలిచినట్టు తెలుస్తోంది. అలాగే ఏకంగా 3 మిలియన్ లైక్స్ ని కూడా ఈ సాంగ్ అందుకొని రికార్డ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. సో మొత్తానికి కుర్చీ సాంగ్ ఫీవర్ ఇంకా తగ్గలేదు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు