నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ “కురుప్”

Published on Dec 15, 2021 1:30 pm IST

దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కురుప్. వేఫర్ ఫిల్మ్స్ మరియు ఎం స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో కురుప్ చిత్రం ప్రసారం అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇంద్రజిత్ సుకుమారన్, శోభిత ధూళిపాళ, సన్నీ వేన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ తరహాలో అలరిస్తుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :