గోపీచంద్ చిత్రంలో మెరవబోతున్న సీనియర్ నటీ?

Published on Mar 4, 2022 3:00 am IST


టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పక్కా కమర్షియల్”. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ఏడాది మేలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక దీని తర్వాత గోపిచంద్ తన తదుపరి సినిమాను శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. గోపిచంద్‌కి ఇది 30వ సినిమా కాగా, శ్రీవాస్‌తో ఇది హ్యాట్రిక్ చిత్రం.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో మొదలయ్యింది. డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బూ ముఖ్య పాత్ర పోషించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. “అజ్ఞాతవాసి” సినిమాలో కనిపించిన కుష్ష్బూ, తాజాగా ఇప్పుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న “ఆడాళ్లు మీకు జోహార్లు” సినిమాలో కూడా ఖుష్బూ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :