ఖుషీ కి రేపటి నుండి గట్టి కాంపిటీషన్!

Published on Sep 6, 2023 5:09 pm IST


విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఖుషీ బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి. కానీ సినిమా సేఫ్ జోన్ లో ఉండాలంటే అది చాలదు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సోమవారం నాడు తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా కలెక్షన్లు పడిపోయాయి. ఖుషీ నైజాంలో గొప్పగా బిజినెస్ సాగిస్తున్నా, వర్షాలు ఆ ఫ్లో ను పాడు చేశాయి.

జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే రెండు భారీ చిత్రాలు రేపు విడుదలై కలెక్షన్లు డివైడ్ అవుతుండడంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ వారం ఖుషీ ఎంత వసూళ్లు రాబదుతుందో చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సమంత హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :