యూఎస్ లో అదిరే రన్ కంటిన్యూ చేస్తున్న “ఖుషి”

Published on Sep 5, 2023 9:57 am IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లేటెస్ట్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి డీసెంట్ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచింది. మొదటి వారాంతానికి సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో అయితే సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది.

ఇక ఇదిలా ఉండగా యూఎస్ లో ఈ చిత్రం మంచి స్టాండర్డ్ తో దూసుకెళ్తుంది. మరి లేటెస్ట్ గా ఈ చిత్రం 1.6 మిలియన్ మార్క్ కి అయితే చేరుకుంది. మరి ఈ చిత్రం ఇప్పటికీ ప్రతీరోజు లక్ష డాలర్స్ గ్రాస్ తగ్గకుండా వసూలు చేస్తుండడం విశేషం. దీనితో మాత్రం లాంగ్ రన్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ చేరుకున్నా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హీషం అందించగా అబ్దుల్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :