యూఎస్ లో రికార్డు మైల్ స్టోన్ అనుకున్న “ఖుషి”

Published on Sep 3, 2023 8:00 am IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే “ఖుషి”. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం యూఎస్ సహా తెలుగు స్టేట్స్ లో అదిరే వసూళ్ళని రాబట్టి ట్రేడ్ వర్గాలకి షాకిచ్చింది.

ఇక యూఎస్ లో అయితే అదిరిపోయే రన్ ని కొనసాగిస్తూ చాలా ఫాస్ట్ గా రికార్డు మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిపోయింది అని కన్ఫర్మ్ అయ్యింది. దీనితో వీకెండ్ కంప్లీట్ కాకుండానే సినిమా ఈ రేంజ్ పెర్ఫామెన్స్ ని కనబరచడం విశేషం. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వచ్చాడు సంగీతం అందించగా మురళి శర్మ, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం :