ఇప్పుడు టాలీవుడ్ నుంచి నెక్స్ట్ నోటెడ్ రిలీజ్ గా రాబోతున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “ఖుషి”. మరి యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో లేటెస్ట్ గా దర్శకుడు శివ నిర్వాణ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను ఎలాంటి అంశాలు పంచుకున్నాడో చూద్దాం రండి.
చెప్పండి సినిమాపై ఇపుడు మంచి బజ్ ఉంది ఏమన్నా ఖంగారుగా ఉన్నారా?
ఖంగారు అంటే ఏమి లేదు ఆల్రెడీ సినిమా ఫస్ట్ కాపీ కూడా పంపించేశాం. సినిమా విషయంలో టీం అంతా కూడా కాన్ఫిడెంట్ గా హ్యాపీగానే ఉన్నారు సో మనం కూడా రిలాక్స్ గా ఉండొచ్చు.
విజయ్, సమంతలు సినిమా చూసారా ఏమన్నారు?
సినిమా విజయ్ గారు చూసారు సమంత గారు బయట ఉండడం వల్ల ఇంకా చూడలేదు. విజయ్ అయితే సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడే తాను చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. సో సినిమా విషయంలో తాను చాలా హ్యాపీ.
ఈ సినిమాకి ‘సఖి’ చిత్రానికి పోలికలు వచ్చాయి..
అవును అవన్నీ నేను కూడా చూసాను. నిజానికి ఈ చిత్రాన్ని నేను డియర్ కామ్రేడ్ తర్వాత చెప్పాను. నేను ఈ లైన్ కోసం చెప్పినపుడు విజయ్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇప్పటికే ఉన్న ఎన్నో వందల వేల ప్రేమ పెళ్లి చిత్రాలు ఉన్నపుడు నా సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి. మరి అలాంటప్పుడు ఆ పాయింట్ ని ప్రెజెంట్ జెనరేషన్ కి చెప్పడానికి సమంత విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు అయితే సరిపోతారు ఎక్కువ రీచ్ ఉంటుంది అనిపించింది. సఖి, పెళ్లి లాంటి చిత్రాలతో కంపేర్ చేశారు కానీ నేను అనుకున్న ఎమోషన్ ని ట్రైలర్ లో చూపించలేదు. కానీ అది థియేటర్స్ లో మీరు చూడాలి.
షూట్ మధ్యలో సమంత హెల్త్ అప్సెట్ అయ్యింది మరి మధ్యలో సినిమా ఆగుతుంది అలా ఏమన్నా భయమేసిందా?
నిజానికి ఈ చిత్రాన్ని నాలుగు నెలల్లో ఫినిష్ చేసేయాలని ప్లాన్ చేసాము. గత ఏడాది ఏప్రిల్ షూట్ స్టార్ట్ చేసి నాలుగు నెలల్లో చేసేద్దాం అని అనుకున్నాం కానీ మధ్యలో సమంత గారికి మాయోసైటిస్ రావడంతో మా కన్నా ఆవిడే ఎక్కువ బాధ పడ్డారు. ఒకరి పరిస్థితి ఒకరు అర్ధం చేసుకుని వీలైనంత సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేసాం.
మ్యూజిక్ అందించిన హీషం కోసం చెప్పండి
ఈ సినిమాకి ముందు థమన్, గోపిసుందర్ లతో చేశాను కానీ ఈ చిత్రానికి కొత్తగా కావాలి అనుకున్నాను పైగా విజయ్ సమంత తో లవ్ స్టోరీ సో ప్రెజెంట్ కొత్త సౌండ్ ఎవరు ఇస్తున్నారు అని చూస్తే దర్శన అనే ఓ ఫేమస్ సాంగ్ ఉండేది ఆ సాంగ్ ఎవరు చేశారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని పిలిచి మాట్లాడుదాం అనుకున్నా అలా హీషం పరిచయం అయ్యాడు. విజయ్ కి కూడా ఇతను మన సినిమాకి బాగుంటాడు అంటే అలా ఓకే చేసేసాం. ఇక సాంగ్స్ కూడా ఇన్స్టంట్ గా కంప్లీట్ చేసేసాం.
ఈ సినిమాలో విజయ్ నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఆశించవచ్చు?
ఈ చిత్రంలో విజయ్ నుంచి అదిరిపోయే కామెడీ టైమింగ్ ని చూస్తారు. ఇది వరకు చూడని విధంగా ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా కనిపిస్తాడు. డెఫినెట్ గా ఫామిలీస్ కి అమ్మాయిలకి తాను ఇంకా బాగా నచ్చేస్తాడు. ఫ్యామిలీస్ లో తన ఇమేజ్ ఇంకా పెరుగుతుంది.
ఈ సినిమాకి మీ రెమ్యునరేషన్ కోసం బాగా వైరల్ అయ్యింది
అవును అవన్నీ నేను కూడా చూసానండి నాకు సమంత విజయ్ గారికి అంత రెమ్యునరేషన్ ఇస్తే నిర్మాతలు సినిమాలు ఎలా తీస్తారు? అవన్నీ చూసి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ లు ఆఖరికి మా అమ్మ కూడా నన్ను అడిగారు. అలాంటివి ఏమి లేదని చెప్పాను.
మీ ప్రొడ్యూసర్స్ కోసం చెప్పండి?
వారి కోసం తెలియనిది ఏముంది చెప్పండి డైరెక్టర్స్ అందరికీ చాలా ఫ్రీడమ్ అందిస్తారు. మనం ఆ ఫ్రీడమ్ ని వినియోగించుకుని మంచి కంటెంట్ అయితే ఎంత వరకు అయినా మనం వెళ్లొచ్చు. అది నేనే కాదు ఏ దర్శకునికి అయినా కూడా అంతే. మేము నిన్ను కోరి సినిమా నుంచే చేయాల్సి ఉంది కానీ అవ్వలేదు. మోటాగా ఈ కథ రవిగారు విని హార్ట్ ఫుల్ గా తీసుకొని ఈ సినిమా చేద్దాం అని చెప్పారు.
సమంత గారి కోసం చెప్పండి?
సమంత గారు ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయ్యిపోయింది. వింటేజ్ సామ్ అంటారు కదా ఈ సినిమాలో ఆ సమంతని చూసి చాలా విషయాల్లో సర్ప్రైజ్ అవుతారు. అలా వింటేజ్ సమంతని అయితే ఈ సినిమాలో చూస్తారు.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటి కోసం చెప్తానండి.