రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొని తెలుగు స్టేట్స్ లో అయ్యితే ఫస్ట్ వీక్ డేస్ నుంచి కొంచెం డల్ అయ్యింది. మరి ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయగా ఇందులో మాత్రం సర్ప్రైజింగ్ గా తమిళ వెర్షన్ లో సూపర్ పెర్ఫామెన్స్ ని ఈ సినిమా కనబరిచింది.
తమిళ్ నుంచి 7 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 9 కోట్ల గ్రాస్ ని అక్కడ కలెక్ట్ చేసి సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరినట్టుగా తెలుస్తుంది. దీనితో తమిళ్ వెర్షన్ లో మాత్రం ఖుషి ప్రాఫిట్స్ అందుకొని హిట్ స్టేటస్ ని కొట్టినట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో లాభాలు అందించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ్ లో కూడా ఇచ్చింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా హీషం అబ్దుల్ సంగీతం అందించాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.