ఓటీటీ డేట్ ఫిక్స్ చేస్తున్న “ఖుషి”.!

Published on Sep 24, 2023 7:04 am IST

మన టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవర కొండ హీరోగా సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం విజయ్ తో పాటుగా సమంత నుంచి కూడా మంచి బౌన్స్ బ్యాక్ సినిమాగా అయితే నిలిచింది.

మరి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి అయితే సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం థియేట్రికల్ గా విడుదల అయ్యిన అన్ని భాషల్లో ఈ అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ రావడానికి ఫిక్స్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి అబ్దుల్ వహద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :