యూఎస్ లో ‘ఖుషి’ సెన్సేషనల్ వసూళ్లు.!

Published on Sep 2, 2023 9:00 am IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషి”. మంచి డీసెంట్ హైప్ మధ్య వచ్చిన ఈ చిత్రం అదిరే వసూళ్లు తెలుగు స్టేట్స్ సహా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం నమోదు చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ చిత్రం యూఎస్ లో ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేయగా మరి మేకర్స్ అఫీషియల్ గా అయితే డే 1 నాటికి 6 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా మొత్తం డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 8 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం ఈజీగా 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని యూఎస్ లో రాబట్టే దిశగా వెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :