కాంబినేషన్ రిపీట్ చెయ్యబోతున్న సూర్య !

కే.వీ. ఆనంద్ దర్శకత్వంలో సూర్య , కాజల్ నటించిన తమిళ చిత్రం “మాట్రాన్” ఈ తెలుగులో బ్రదర్స్ పేరుతో అనువాదం అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబడ్డ ఈ సినిమా పరువాలేదు అనిపించింది. తాజా సమాచారం మేరకు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం సూర్య నటించిన గ్యాంగ్ సినిమా జనవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి సురేష్ హీరొయిన్ గా నటించిన ఈ సినిమాను వేగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా టిజర్ విడుదల కానుంది. గ్యాంగ్ సినిమా తరువాత సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఆ మూవీ తరువాత కేవీ.ఆనంద్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కోలివుడ్ సమాచారం.