“ఎఫ్3” సాంగ్స్ హంగామా…ఫస్ట్ లిరికల్ వీడియో కి డేట్ ఫిక్స్!

Published on Feb 3, 2022 11:30 am IST


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రిన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2 చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్, తాజాగా చిత్రం లోని పాటలను ఒక్కొక్కటి గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ సాంగ్ కి సంబంధించి ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ ఇవ్వడం జరిగింది. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు లిరికల్ వీడియో ను ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఎఫ్ 3 సాంగ్స్ హంగామా షురూ కావడం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :