బన్ని కోసం లేడి కోరియోగ్రఫర్ !
Published on Dec 2, 2017 11:38 am IST

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను వక్కంతం వంశి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మానుల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్ని డాన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి సినిమాలో బన్ని డిఫరెంట్ మూమెంట్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటాడు.

జాని, శేఖర్, ప్రేమ రక్షిత్ వంటి డాన్స్ మాస్టర్స్ బన్నికి డాన్స్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నాపేరు సూర్య సినిమాకు జాతీయ అవార్డు సాధించిన నృత్య దర్శకురాలు వైభవీ మర్చంట్ బన్నీకి కొరియోగ్రాఫీ అందిస్తోంది. బాలివుడ్ లో పలు సినిమాలకు పనిచేసిన వైభవి ఈ సినిమాకు పనిచేస్తుండడం విశేషం.

 
Like us on Facebook