పవన్ పై లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jun 14, 2022 1:50 pm IST


ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో రానా దగ్గుబాటి హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం “విరాట పర్వం” కూడా ఒకటి. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు సుకుమార్ లేడీ పవర్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చిన సాయి పల్లవి ఈటీవీలో క్యాష్ షోకి హాజరు కాగా ఈ షో లో టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పవన్ ఎప్పుడు తనని తాను ఒక సూపర్ స్టార్ లా అనుకోరు అని అలా సాధారణ మనిషి లానే వెళ్ళిపోతారు. తన హార్ట్ కి ఏమనిపిస్తే అది సూటిగా మాట్లాడుతారు అందుకే పవన్ అంటే నాకు ఇష్టం అని సాయి పల్లవి తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు మంచి వైరల్ అవుతున్నాయి. అలాగే రీసెంట్ గానే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా పవన్ నిజ జీవితానికి దగ్గర ఉండేలా ఉంటుంది అని కూడా దర్శకుడు కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి ఈ జూన్ 17న వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :