కృష్ణ గారితో వర్క్ పై లేడీ సూపర్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

కృష్ణ గారితో వర్క్ పై లేడీ సూపర్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Nov 16, 2022 9:00 AM IST

తెలుగు సినిమా దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ఓ మహా శకం ముగిసింది. మరి కృష్ణ గారిని అయితే స్మరించుకుంటూ అనేకమంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు అయితే వారి అనుభవాలను కృష్ణ గారితో పంచుకోగా తాజాగా ప్రముఖ సీనియర్ నటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో పలు ఆసక్తికర అంశాలు పంచుకోవడం మరింత ఆసక్తిగా మారింది.

“ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా… నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా…” అని, మీరు విజయనిర్మల గారితో అంటే… “నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది” అని 1980లో ఆంటీ అన్న మాట… నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం.” అని ఓ ఆసక్తికర ఫ్యాక్ట్ ని పంచుకోగా..

“సూపర్ స్టార్ అయిన మీతో ఆ తర్వాత ఎన్నో హిట్స్, సూపర్‌హిట్స్. ఆ “కిలాడీ కృష్ణుడు” నుండి “ఒసే రాములమ్మ” వరకూ ఎన్నో సినిమాలలో కళాకారులుగా కలసి పనిచెయ్యగలిగాం…ఇప్పుడిక వెళ్లిపోయిన ఆంటీతో పాటు మీరు కూడా… అపురూపమైన జ్ఞాపకం…సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు” అంటూ ఆయనతో వర్క్ పై భావోద్వేగంతో ఇద్దరి ఫొటోలతో భావోద్వేగ స్పందన వ్యక్తం చేశారు.

https://twitter.com/vijayashanthi_m/status/1592539053878280193?s=20&t=9J9na1dinnDd5LlHmmRphQ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు