రవితేజ మూవీలో లేడీ విలన్‌గా ఆ హాట్ బ్యూటీ?

Published on Jan 6, 2022 2:04 am IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర‘ చిత్రం జనవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం హాట్ బ్యూటీ దక్ష నగార్కర్‌ని తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆమె నెగెటివ్ షేడ్ పాత్రలో కనిపించనుందని, ఆ పాత్ర ద్వారా రవితేజకి ధీటుగా ఆమె నటించనున్నదట. ఇప్పటికే జాంబీ రెడ్డి చిత్రంలో ఈ హాట్ బ్యూటీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయినా సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో నెగెటివ్ షేడ్‌తో ఈ భామ ఎలా మెప్పిస్తుందో, అసలు ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :