ఆ క్రేజీ ప్రాజెక్టులన్నీ లహరి మ్యూజిక్ చేతికే..!

lah
లహరి మ్యూజిక్.. తెలుగులో మ్యూజిక్ కంపనీల్లో టాప్ స్థానాల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోన్న లేబల్. ఈమధ్యకాలంలో ‘జనతా గ్యారేజ్’, ‘సరైనోడు’ లాంటి రెండు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్‌ను అందించిన ఈ సంస్థ తాజాగా మూడు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకుంది. సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ‘ఖైదీ నెం 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘బాహుబలి 2’ ఈ మూడు సినిమాల మ్యూజిక్ హక్కులనూ లహరి మ్యూజిక్కే సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

లహరి సంస్థ నిర్వాహకులు భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాల మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్నారట. ఇక పైన చెప్పిన మూడు సినిమాలూ వేటికవే ప్రత్యేక గుర్తింపుతో, క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నేపథ్యంలో ఈ సినిమాల ఆడియో రిలీజ్ విషయంలోనూ లహరి మ్యూజిక్ ఆయా సినిమాల నిర్మాతలతో కలిసి ప్రత్యేకంగా ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోందట.