ఫన్ రైడ్‌గా విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్

ఫన్ రైడ్‌గా విశ్వక్ సేన్ ‘లైలా’ ట్రైలర్

Published on Feb 6, 2025 4:52 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ అంచనాలను పెంచాయి.

అయితే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా కట్ చేశారు మేకర్స్. సోను మోడల్ పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్.. అతడు చేసే కామెడీ ఆకట్టుకోనుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక అతడు ఎదుర్కొనే సమస్యల కారణంగా లైలా గా ఎందుకు మారాడు అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. అయితే, లేడీ పాత్రలో విశ్వక్ సేన్ చేసే అల్లరి మామూలుగా ఉండబోదని చిత్ర యూనిట్ ఈ ట్రైలర్‌లో ప్రజెంట్ చేశారు.

అటు హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకోనుంది. లియోన్ జేమ్స్ సంగీతం మేజర్ అసెట్‌గా రానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు