మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
అయితే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు మేకర్స్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జనవరి 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను AAA సినిమాస్‌లో నిర్వహించనున్నారు.
ఈ సినిమాలో విశ్వక్ తన రెండు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.