‘దొంగాట’ టైటిల్ కన్ఫర్మ్ చేసిన మంచు లక్ష్మి..!

Lakshmi-Manchu--New-Photos-
మంచు లక్ష్మి, అడవి శేష్ ప్రధాన పాత్రధారులుగా వంశికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘దొంగాట’ టైటిల్ ఖరారు చేశారు. నేడు ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వెల్లడించారు.

వైవిధ్యమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా అతిధి పాత్రలో నటించారు. చిన్న పాత్రయినా, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో రానా కనిపిస్తారు. ఎవరైనా స్టార్ హీరో ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. రానాను కలసి ఆ సినిమాలో పాత్ర ప్రాముఖ్యత వివరించగానే, రానా అంగీకరించారు.

మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలో సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version