
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి.. నటిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నారు. తాజాగా ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు వైఎస్ ప్రెసిడెంట్‌గా కూడా ఎన్నికై కొత్త పాత్రలో తన మార్క్‌ను చూపెట్టనున్నారు. ఇవేకాక ఇప్పుడు కొత్తగా మరో సరికొత్త పాత్రలో ఆమె దర్శనమివ్వనున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం దొంగాట. అడవి శేష్, మంచు లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ పాటకు మంచు లక్ష్మి గొంతు కలిపారు. రఘు కుంచె సంగీతం సమకూర్చిన ఓ పాటలో లక్ష్మి గొంతు వినొచ్చు. మంచు లక్ష్మి యాక్టింగ్‌తో పాటు గాత్రంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడామె ఓ పాట పాడనుండడం సాధారణంగానే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మంచు లక్ష్మి పాడింది ఓ ప్రోమో పాటగా తెలుస్తోంది. ఈ పాటలో సినిమాతో సంబంధం లేని కొంత మంది స్టార్స్ నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ కొత్తగా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంటోంది.