వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ చిత్రం ఏపీలో రిలీజ్ కు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులు ఈ సినిమాను చూడనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి మరియు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఈ సినిమాను చూడనున్నారు. వారు చూశాక సినిమా విడుదల పై నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే విడుదలైన తెలంగాణ మరియు ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
