లక్ష్ చదలవాడ “ధీర” సెకండ్ షెడ్యూల్ పూర్తి!

Published on Jun 10, 2022 10:06 am IST


వరుస సినిమాలతో దూసుకుపోతూ కెరీర్ పరంగా డిఫరెంట్‌ స్టెప్స్ వేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్. కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయన, ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ గంగరాజు, ధీర సినిమాలు చేస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు.

ఓ విలక్షణ కథకు కమర్షియల్ హంగులు జోడించి పవర్‌ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ధీర మూవీకి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేశారు. విశాఖలోని అందమైన ప్రదేశాల్లో ఓ సాంగ్ చిత్రీకరించడంతో పాటు చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన అన్ని సన్నివేశాలు చాలా బాగా రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

క్లాస్, మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు జోడిస్తూ ఈ ధీర సినిమాను రూపొందిస్తున్నారు. మిగిలిన కొంతభాగాన్ని అతిత్వరలో కంప్లీట్ చేసి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. హీరో లక్ష్ నటించిన మరో సినిమా గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఈ నెల 24 న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ అప్డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి.

ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం విక్రాంత్ శ్రీనివాస్,
నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, బ్యాన‌ర్‌ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, సినిమాటోగ్ర‌ఫీ క‌ణ్ణ పి.సి, సంగీతం సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌ మధు బీడీ, స్టంట్స్ జాషువా, డైలాగ్స్ విక్రాంత్ శ్రీనివాస్, ఆర్ శృతిక్, ప్రొడక్షన్ కంట్రోలర్ అక్కినేని శ్రీనివాస రావు, పి.ఆర్‌.ఓ సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :