సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నాగ శౌర్య “లక్ష్య”

Published on Dec 7, 2021 12:31 pm IST

నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం లక్ష్య. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందుకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక సైతం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడం తో ఇక విడుదల కి సిద్దం అయింది. ఈ చిత్రం లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా కేతిక శర్మ నటించగా, జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :