రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న లక్ష్య… థియేటర్ల లోకి ఎప్పుడంటే?

Published on Nov 24, 2021 7:09 pm IST

నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. ఈ చిత్రం విడుదల తేదీ పై తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా డిసెంబర్ లో మరొక చిత్రం బరిలోకి రావడం తో ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేదెకర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాళ భైరవ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More