నాగ శౌర్య “లక్ష్య” రిలీజ్ డేట్ పై రేపే ప్రకటన!

Published on Sep 26, 2021 8:41 pm IST


నాగ శౌర్య హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా దీరెంద్ర సంతోష్ జాగర్లపుడీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్య. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేది పై ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ ను గెస్ చేయండి అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అక్టోబర్ 15, అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 12 తేదీలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన విడుదల తేదీ ను రేపు ప్రకటించనుంది చిత్ర యూనిట్. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :