వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “లక్ష్య”

Published on Feb 4, 2022 11:50 am IST

నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకాల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా, కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓటిటి లోకి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది. స్టార్ మా మూవీస్ లో ఫిబ్రవరి 11 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. బుల్లితెర పై ఈ చిత్రం ఏ తరహ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :